Telugu Gateway
Cinema

రేస్ గుర్రం లా రామ్ చరణ్

రేస్ గుర్రం లా  రామ్ చరణ్
X

రామ్ చరణ్ దూకుడు చూపిస్తున్నారు. వరసపెట్టి సినిమాలు ప్రకటిస్తూ ఫాన్స్ కు సర్ప్రైజ్ లు ఇస్తున్నారు. ఇప్పటికే చేతిలో రెండు సినిమాలు ఉండగా హోళీ రోజు మరో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. అది కూడా సూపర్ హిట్ కాంబినేషన్ లో. దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఈ ఆర్ సి 17 సినిమా రానుంది. వీళ్ళు ఇద్దరు కలిసి చేసిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం దక్కించుకుందో అందరికి తెలిసిందే. ఈ సినిమా ను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

చిత్ర నిర్మాణ సంస్థే కొత్త సినిమా కు సంబంధించిన రెండు ఫోటో లను సోషల్ మీడియా లో షేర్ చేసి విషయాన్నీ బహిర్గతం చేసింది. ఈ సినిమాతో భారతీయ సినిమా కు కొత్త రంగులు అద్దనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కొత్తగా దర్శకుడు బుచ్చి బాబు తో కలిసి కొత్త సినిమా ను కూడా స్టార్ట్ చేశారు.

Next Story
Share it