Telugu Gateway
Top Stories

ఆర్థిక రాజధాని నుంచి..బిల్లియనీర్ల కాపిటల్ గా!

ఆర్థిక రాజధాని నుంచి..బిల్లియనీర్ల కాపిటల్ గా!
X

ముంబై ని దేశ ఆర్థిక రాజధానిగా పిలుస్తారు అనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ నగరానికి మరో కొత్త పేరు వచ్చింది. అదేంటి అంటే ఆసియాలోనే అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న నగరంగా..బిలియనీర్ల కాపిటల్ గా ముంబై అవతరించింది. 2024 సంవత్సరానికి సంబంధించి హురున్ విడుదల చేసిన జాబితాలో ముంబై ఈ ఘనతను దక్కించుకుంది. ఈ జాబితా ప్రకారం ముంబై లో ప్రస్తుతం 92 మంది బిలియనీర్లు ఉన్నారు. వీళ్ళ మొత్తం ఆస్తుల విలువ 445 బిలియన్ డాలర్లు. అంటే మన భారితీయ కరెన్సీలో వచ్చేటప్పటికి 36, 93 , 500 కోట్ల రూపాయలు. బిలియనీర్ల విషయంలో బీజింగ్ ను వెనక్కి నెట్టి ముంబై ముందుకు వచ్చింది. అయితే ముంబై, బీజింగ్ ల మధ్య ఈ విషయం లో ఉన్న గ్యాప్ ఒకటి మాత్రమే. బీజింగ్ లో ప్రస్తుతం 91 మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే చైనా లో 814 మంది బిలియనీర్లు ఉంటే...అమెరికాలో 800 మంది బిలియనీర్లు ఉన్నారు.

అంటే ఈ విషయంలో మొదటి రెండు స్థానాలను చైనా, అమెరికాలు దక్కించుకున్నాయి. మూడవ స్థానంలో ఇండియా ఉంటే...ఆ తర్వాత స్థానాల్లో వరసగా యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, స్విట్జర్లాండ్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రెజిల్ లు ఉన్నాయి. ఇండియాలో ఈ మొత్తం బిలియనీర్ల సంఖ్య 271 మందిగా ఉంది. నగరాల విషయానికి వస్తే ముంబై ప్రపంచంలోనే మూడవ స్థానంలో నిలిచింది. అమెరికా లోని న్యూయార్క్ లో ఏకంగా 119 మంది బిలియనీర్లు ఉండగా, 92 మంది బిలియనీర్ల తో ముంబై రెండవ స్థానంలో నిలిచింది. ఈ ఏడాదిలో కొత్తగా ముంబై 26 మంది బిలియనీర్లను జత చేయగా..బీజింగ్ లో 18 మంది జాబితా నుంచి వెళ్లిపోయారు.

Next Story
Share it